About Temple

శ్రీ దత్తసాయి ఆలయము

శ్రీ దత్తసాయి వారి ఆలయమునకు వెనుక భాగము నందు కలదు ఇచ్చట ప్రతి పౌర్ణమి నందు హోమములు వెల రూ 500/-. మరియు ప్రతి రోజు అభిషేకము, అర్చన నిర్వహించబడును.

నవగ్రహలయము

శ్రీ స్వామివారి ఆలయ ప్రాకారములో ఉన్న ఈ ఆలయము నందు ప్రతి రోజు ఉ 9-00 గం నవగ్రాహభిషేకం నిర్వహించబడును.

శ్రీ సత్యనారయణ స్వామి వారి ఆలయం

శ్రీ స్వామి వారి ఆలయ ప్రాకారాములో ఉన్న ఈ ఆలయము నందు ప్రతి సంవత్సరము కార్తిక బహుళ త్రయోదశి రోజున శ్రీ సత్య నారాయణ స్వామివారి వార్షికోత్సవం నిర్వహించబడును.

శ్రీ శివాలయము

శ్రీ స్వామివారి ఆలయ ప్రాకారములో ఉన్న ఈ ఆలయము నందు ప్రతి రోజు ఉ 8-30 గం కురుద్రాభిషేకము తదుపరి అర్చనలు నిర్వహించబడును. మహా శివరాత్రి పర్వదిన సందర్భమున 3 రోజులు ఉత్సవంతో పాటుగా స్వామివారి కళ్యాణోత్సవము జరుపబడును.

శ్రీ రామాలయము

శ్రీ స్వామి వారి ఆలయ ప్రాకారాములో ఉన్న ఈ ఆలయము నందు ప్రతి రోజు ఉ 8-30 గం లకు హనుమాండ్ల అభిషేకము ఉ 9-00 నుండి ఉ 12-30 గం వరకు మరియు సా 4-00 నుండి 6-30 గం వరకు అర్చనలు జరుపబడును శ్రీరామనవమి సందర్బమున కళ్యాణోత్సవము జరుపబడును.

రేణుక ఎల్లమ్మ దేవాలయము

శ్రీ స్వామివారి కోనేరు వద్ద ఉన్నటువంటి ఈ ఆలయములొ ప్రతిరోజు అమ్మవారికి అర్చనలు ఒడిబియ్యం, ప్రతి ఆదివారం భక్తుల భోజనాలు ఒడిబియ్యం పోయుట కార్యక్రమములు నిర్వహించబడును.

కాలభైరవ స్వామి మందిరము

శ్రీ స్వామి వారి క్షేత్రపాలకుడు అయినటువంటి ఈ ఆలయములో అభిషేకము ప్రతి రోజూ ఉదయం 9.00 గంటలకు లకు నిర్వహించబడును.