History
శ్రీశ్రీశ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి క్షేత్రము భాగ్యనగరమునకు 55 కి.మి దూరములో జాతీయ రహదారి నెం.44 తూప్రాన్, పోతరాజుపల్లి కమాన్ నుండి 6కి.మి దూరములో గజ్జ్వేల్ – ప్రజ్ఞాపూర్ పోవు దారితో పవిత్ర హరిద్రానది (హల్దివాగు) ఒడ్డున వెలసివునది, కృతాయుగంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు నృసింహ అవతారము వలస వెలువడిన ధ్వనికి భూనభోంత రాళములు దద్దరిల్లెను . శ్రీ నృసింహ గర్జన కొండలలోనికి, కొండ సొరంగములోనికి , గుహలలోనికి , అరణ్య ప్రాంతములొనికి ఎతైన పర్వత శ్రేణులలోనికి, నదీ ప్రవాహక ప్రాంతము లోనికి వ్యాపించెను. శ్రీ నాచగిరి (శ్వేతగిరి) లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రము కూడా అటువంటి ప్రాంతములలొ ఒకటి. గార్గేయ మహర్షి నవనాథ మునులు నాచగిరి యందలి ఎతైన గుండ్ల నుండి వెలువడి నృసింహ గర్జన విని, ఈ స్థలము తపమాచరించిరి, శేషశాయిమాదిరి గల గుహను పరిశీలించగ శ్రీ స్వామి వారు స్వయంభువువై ఆర్చావతార మూర్తిని చూచి ఆనందిచిరి, శ్రీ నరసింహ అనుగ్రహముతో(హరిద్రానది) హల్దివాగు పసుపు కుంకుమ పోలిన భూముల గుండా నీలి వర్ణోదకము నిoగికెసిన ఉత్సాహములో అరుణ జ్యోతుల హారతి పట్టు కోని పట్టు కోని పశ్చిమ దిశగా బయలుదేరి. శ్రీ స్వామి వారి పాదములు కడుగుచు ఉత్తర దిశగా ప్రవహిoచుచున్నది. నాచర్ లనే భక్తుడు శ్రీ స్వామి వారికి సేవ చేసెను వారి సేవా ఫలితముగా భక్తుని కోరిక పై ఇచట వెలసెనని చెపుదురు. శ్రీ నరసింహ స్వామి వారిని దాదాపు 5000 సంవత్సరముల నుండి అర్పించి పూజిoపబడుచున్నారు. ఒకానొక సమయములొ కృష్ణావదూత అను భక్తుడు శ్రీ స్వామి వారికి సేవచేయుచు కాలము
గడుపుచుoడేను వారిని భక్తులు శ్రీ నృసింహ స్వామి వారికి భక్తి భావముతో దర్శించిన శత్రుభాద నివారనమగును ప్రయోగముల శమించును భూత, ప్రేత, పిచాచ భాదలు నివారించబడును మరియు దీర్గ
రోగములు శమించెను కోర్టు తగాదాలు పరిష్కరించబడును . కుటుంబ శాంతి, సంతానము, ఉద్యోగము, వ్యాపారము వివాహ సంబందములు కుదురును అని వారి
అనుభవము లోకమునకు చాటిరి ఈ దేవాలయము ద్యైతులకు అద్వైతులకు, విశిష్టాద్వ్యైతులకు మరియు ఇతర మతముల వారికి కల్పతరువై మరియు మనోభావమందిరమై విరాజిల్లుతునది. ఇట్టి మహ
ిమాన్విత చరిత్ర కలిగిన ఇట్టి దేవస్థానమునoదు జరుగు పూజాది కార్యక్రమములలో పాల్గొని, సేవించి శ్రీ స్వామి వారి కృపాకటాక్షములను పొందగలరు.

నవగ్రహలయము
శివాలయము
కాలభైరవ స్వామి మందిరము
Note:-
For Donation Temple A/c No
1)APGVB A/c 1812715238 (IFSC CODE - SBIN ORRAPGB)
2)Corporation Bank A/c No 15272 (IFSC CODE- Corp 0000708)